విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలుష్యరాహిత నగరానికి విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో నగర పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చర్చించారు. అందులో భాగంగా పచ్చదనాన్ని మరింత నగర సుందరీకరణ, కాలుష్య నియంత్రణ కొరకు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల అభివృద్ధి, త్రాగునీరు మరియు నీటి సరఫరా, అనధికార నిర్మాణాలు తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మాట్లాడుతూ ప్రజల నగరంలో ఎక్కువ మొక్కలను నాటుతు, కాలుష్యరహిత సమాజాన్ని నిర్మించేలా నగర సుందరీకరణ చేయటానికి ప్రణాళిక సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. కేవలం వాయువు కాలుష్యమే కాకుండా నీటిని కూడా సివేజ్ స్టేట్మెంట్ ప్లాంట్ల అభివృద్ధి ద్వారా శుద్ధి చేస్తూ నీటి కాలుష్యాన్ని చర్యలు తీసుకోమని అధికారులు అన్న ఆదేశించారు. నగరంలో అనధికార నిర్మాణాలు జరగకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, సూపరెండింటింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర రెడ్డి, ఏ ఎస్ ఎన్ ప్రసాద్, సామ్రాజ్యం, చంద్రశేఖర్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, పి వో యు సి డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.