Breaking News

మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరీక్షల పరికరాలు సమకూర్చడంతో పాటు, వివిధ సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో జిల్లా ఖనిజ నిధి (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) వినియోగంపై పంచాయతీరాజ్ , వైద్య ఆరోగ్య, విద్య, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కలెక్టర్ సమీక్షించారు.

జిల్లా ఖనిజ నిధుల నుండి గతంలో మంజూరైన పనులు వాటి పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. పురోగతిలో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మంజూరైన పనుల్లో ఇంకా గ్రౌండింగ్ కానీ వాటిని, టెండర్లు పిలవని వాటిని క్యాన్సిల్ చేయుటకు, కొత్త పనులు చేపట్టుటకు ప్రతిపాదనలు పంపాలన్నారు. జిల్లా ఖనిజ నిధులతో తాగునీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో 55% నిధులు, రోడ్లు, వంతేనలకు 40 శాతం నిధులు వినియోగించాలనే నిబంధనలు కచ్చితంగా పాటించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ ఏర్పాటు, సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాల కల్పన, అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు, ఆక్వా ల్యాబ్స్ బలోపేత చర్యలు, తదితర పనులకు సంబంధిత శాఖల అధికారులు వెంటనే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. వీటిని గవర్నింగ్ సమావేశంలో ఆమోదించుటకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా గనుల శాఖ డిడి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, డి ఏం అండ్ హెచ్ వో డాక్టర్ జి గీతాబాయి, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, డిసీహెచ్ఎస్ డాక్టర్ శ్రావణ్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి జి రమేష్, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారతాధికారి ఫణి దూర్జటి, సిపిఓ గణేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు

-జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం – సమ్మె విరమణ -తద్వారా 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి -ఆహారం,పౌరసరఫరాల మరియు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *