Breaking News

సామూహిక ఎలుకల నివారణతో రైతుకు మేలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రైతులందరూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టి తమ పంటలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో సామూహిక ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గోడ పత్రిక ఆవిష్కరించారు. విత్తనం వేసినది మొదలు ధాన్యం అమ్మే వరకు ఎలుకలు వరి పైరుకు, ధాన్యానికి అపార నష్టం కలిగిస్తాయని, ఎలుకలను సమర్థవంతంగా నివారించుటకు వ్యవసాయ శాఖ వారు సూచించిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు.

జింక్ పాస్పైడ్, బ్రోమోడైలోన్ లేదా అల్యూమినియం పాస్పైడ్ రసాయనాలను ఉపయోగించి రైతులు ఎలుకలను సామూహికంగా నివారించాలని, ప్రస్తుతం జిల్లా వ్యవసాయ శాఖ వారు బ్రోమోడైలోన్ మందును 100 శాతం రాయితీపై రైతు సేవా కేంద్రాలలో సరఫరా చేస్తున్నారని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి ఎన్ పద్మావతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి జె జ్యోతి, జిల్లా మత్స్య శాఖ అధికారి చంద్రశేఖర్ రావు, వ్యవసాయ శాఖ ఏడీ మణిధర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *