-త్వరలోనే మరిన్ని క్రీడలకు రాష్ట్ర స్థాయి పోటీలు
-68వ రాష్ట్ర అంతర జిల్లాల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ -2024 ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరం దివాన్ చెరువు లోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో 68వ రాష్ట్ర అంతర జిల్లాల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ -2024 నకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హ్యాండ్ బాల్ క్రీడను మరింత ప్రోత్సహించాల్సిన అవసరముందని వెల్లడించారు. చదువులతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం అవుతుందన్నారు.
రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని, మన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి శుభాశీస్సులు అందించారు. టోర్మమెంట్ నిర్వహించేందుకు కారణమైన డీఈవో, పీడీలకు ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ ల ద్వారా తూర్పుగోదావరి జిల్లా క్రీడా ప్రతిభ ప్రపంచం నలుమూలలా తెలుస్తుందన్నారు.
హ్యాండ్ బాల్ అద్భుతమైన క్రీడ అని, దీనిని రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించు కోవడం ద్వారా అందరికీ ఈ క్రీడపై అవగాహన కలుగుతుందన్నారు. హ్యాండ్ బాల్ క్రీడను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. త్వరలోనే బాల్ బ్యాడ్మింటన్, ఇతరత్రా క్రీడలకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొని క్రీడల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందాలంటే చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించినప్పుడే సాధ్యమవుతుందని విద్యార్థులకు సూచించారు. ఇటువంటి క్రీడల్లో పాలుపంచుకోవడం ద్వారా శారీరక ధారుడ్యం, మానసిక వికాసాన్ని పెంచుకోవాలని సూచించారు. మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఉత్తమమైన విద్యార్థులుగా రూపొందడానికి క్రీడలు దోహద పడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తే భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోనిచ్చారు.
పాఠశాలల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లు నిర్వహించుకునే అవకాశం కల్పించినందుకు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ యాజమాన్యానికి మంత్రి దుర్గేష్ అభినందలు తెలిపారు.
కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ యాజమాన్యం విజయ ప్రకాష్, అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ యాజమాన్యం విజయ్ ప్రకాష్, ఫిజికల్ డైరెక్టర్లు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.