విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు కనకదుర్గమ్మ అమ్మవారు “శ్రీ మహా చండీ దేవి” గా భక్తులకు దర్శనమిస్తున్నారు. జిల్లా కలెక్టర్ డా. జి. సృజన, పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు భక్తుల కు కల్పిస్తున్న సౌకర్యాల ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా క్యూలైన్లన్నీ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చంటిబిడ్డ తల్లులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకుని వారికి కావలసిన ఏర్పాట్లను వెను వెంటనే ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు త్రాగునీరు, చిన్న పిల్లలు, బాలింత లకు వేడి పాలు, మజ్జిగ ప్యాకెట్లను అందించడం జరుగుచున్నది. నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవో పేతంగా కనుల పండుగగా నిర్వహించుకుంటూ భక్తులు భక్తి పారవశ్యంతో జై దుర్గా భవాని….. మాతాకుజై అనే నినాదంతో అమ్మ వారిని దర్శించుకుంటున్నారు. 500, 300, 200 రూపాయల క్యూలైన్లతో పాటు ఉచిత దర్శనం క్యూలైన్లో కూడా భక్తులు ఆగకుండా నిరంతరం సాఫీగా సాగే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కొండ దిగువన శ్రీ వినాయక గుడి వద్ద నుండి కొండ పై వరకు క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షించి, ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణ ఏర్పాట్లు చేయటం జరుగుచున్నది. క్యూలైన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే వాటిని పరిష్కరించే దిశగా అధికారులు అప్రమత్తమవుతున్నారు. విఐపి లు, వివిఐపీలు దర్శనానికి వచ్చినప్పటికీ సామాన్య భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతున్నారు. వృద్ధులు వికలాంగులను కొండ దిగువ నుండి ప్రత్యేక వాహనాల లో తీసుకువచ్చి వారికి దర్శనం చేయించి తిరిగి వారిని కొండ క్రింది వరకు చేర్చే బాధ్యతను పోలీస్ సేవా దళం సిబ్బంది తీసుకుంటున్నారు. విధులు నిర్వహించే సిబ్బంది అందరూ భక్తి భావంతో సేవా దృక్పథంతో తాము ఇక్కడికి వచ్చామని భక్తుల పట్ల గౌరవ మర్యాదలు పాటించాలని అధికారులు సూచించారు. విధులలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Tags vijayawada
Check Also
ప్రజాస్వామ్యయుతంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించే పార్టీ తెలుగుదేశం
-శాసననభ్యులు గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలో జాతీయ రాష్ట్ర స్థాయిల్లో అనేక పార్టీలు …