తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్(NAC) నందు 10-10- 2024 అనగా ఈ గురువారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: NAC Training Center, opp: SV Medical College, Tirupati, Tirupati Dist.
ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అపోలో ఫార్మసీ, ఇండోఎంఐఎం , ఇన్నో ఓ సోర్స్( డీ మార్ట్, ఎస్బిఐ కార్డ్స్) లో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. విద్యార్హతలు: పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా బీటెక్ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్త అయిన యువతీ యువకులు అర్హులు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు విద్యార్హత సంబందించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ మరియు బయోడేటా ఫామ్ తో జాబ్ మేళాకు హాజరు అవ్వవలెను అదేవిధంగా క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను అని తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.
రిజిస్ట్రేషన్ లింకు: https://shorturl.at/WFyy1
మరిన్ని వివరములకు 9703437472 మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు.