-రైతు బజార్లలో కేజీ టమాటా 50, కర్నూలు ఉల్లి 35, మహారాష్ట్ర ఉల్లి 50 లకు అందుబాటులో
-జెసి చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలాగా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు అధికంగా ఉన్నాయని వాటిని నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాలయం అన్న రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు బజార్లలో సబ్సిడీపై టమాటా, ఉల్లిపాయలను అందుబాటులోకి ఉంచామన్నారు. వినియోగదారులకు ఇతర కూరగాయలు ఆకుకూరలు కూడా సరసమైన ధరలకు అందుబాటులో వచ్చేందుకు ధరల నియంత్రణ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టాల్సిందన్నారు. ప్రజలు రైతు బజార్లలో కూరగాయలను కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల సంబంధించి నిత్యవసర సరుకులు పంపిణీ చేసే వాహనాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని రైతుబజార్లలోనే కూరగాయలు కొనుగోలు చేసే లాగా ప్రచారం చేపట్టాలని కోరారు.
జిల్లాలోని రైతు బజార్లలో కేజీ టమాటా రూ.50, కర్నూలు ఉల్లి రూ.35, మహారాష్ట్ర ఉల్లి రూ 50 లకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. డిమాండ్ అనుసరించి దిగుబడి ఉన్న ప్రాంతాల్లో నుంచి కూరగాయలను సేకరించి రైతు బజార్లో ప్రజలకు అందుబాటులో ఉంచేలాగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పండుగ సందర్భంగా ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక విజిలెన్స్ పెట్టాల్సి ఉందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం సునీల్ వినయ్, జిల్లా పౌర సరఫరాల అధికారి జేబిఎస్ఎన్ ప్రసాదరావు, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్యాముల్ రాజ్, రైతు బజార్లో ఎస్టేట్ ఆఫీసర్లు, అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.