విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2018,2019 సంవత్సరంలో ఉపాధిహామీ పథకంలో పెండింగ్ లో ఉన్న బకాయిలు 530 తక్షణమే విడుదల చేయాలి అని రాష్ట్ర ఉపాధిహామీ మండలి మాజీ సభ్యులు వీరంకి వెంకట గురుమూర్తి(కృష్ణ), డా||శ్రీనివాసమూర్తి(అనంతపురం) పోతుగంటి పీరయ్య,(కడప) మొవ్వ లక్ష్మీ సుభాషిని (గుంటూరు) ఈరోజు రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యాలయంలో పంచాయతీరాజ్ కమిషనర్ యం. కృష్ణ తేజ, డైరెక్టర్ షణ్ముక్ కుమార్ ని కలిసి పెండింగ్ బిల్లులు విడుదల కోసం చర్చించడం జరిగింది. Q.C రికవరీ కింద 178 కోట్లు 21% తాలూకా బకాయిలు 328 కోట్లు 6% తాలూకా బకాయిలు 28 కోట్లు మొత్తం 530 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు.
గత వైసీపీ ప్రభుత్వం కేవలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు చేశారు అనే కక్ష సాధింపుతో బిల్లులను నిలిపివేసి ఆనాడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, గ్రామ అభ్యుదయ కమిటీలు, చిన్నచిన్న గుత్తేదారులను నానా ఇబ్బందులు పెట్టారని అన్నారు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం సిమెంట్ రోడ్లు, అంగన్వాడి బిల్డింగులు, పంచాయతీరాజ్ బిల్డింగులు,
స్త్రీ శక్తి భవనాలు, సంపద తయారీ కేంద్రాలు ,పంట గుంటలు పనులు చేసిన పాపానికి ఐదు సంవత్సరాలపాటు బిల్లులు చెల్లించకపోవడం వలన అప్పులపాలు అయ్యి ఆస్తుల అమ్ముకొని 50 మంది పైగా అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు *తెలుగుదేశ కేంద్ర కార్యాలయంలో NREGS గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా నిలబడి బాధితుల తరఫున హైకోర్టులో న్యాయ పోరాటం చేసి సుమారుగా 4000 కోట్ల వరకు గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు ఇప్పించడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిన మిగిలిన పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయమని కమిషనర్ యం.కృష్ణ తేజాను కోరగా, సానుకూలంగా స్పందించి, పెండింగ్ బిల్లులు విడుదలకు సాంకేతిక పరమైన ఇబ్బందులను తొలగించి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తక్షణమే పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేస్తామని చెప్పియున్నారు.
రాబోయే ఏడు రోజులు పాటు జరిగే పల్లె పండుగలో 4500 కోట్లతో 3000 కిలోమీటర్లు 50000 సిసి రోడ్ల నిర్మాణం సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేస్తామని, ఈ నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరారు.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …