-ఏపీలో ప్రస్తుతం 1 కోటీ 48లక్షల 43వేల 671 రేషన్ కార్డులు
-ఇందులో 89 లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద నిత్యవసర సరుకులను అందిస్తోంది
-మిగిలిన 59,43,671 రేషన్ కార్డులకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ వంద రోజుల పాలన సందర్భంగా కొత్తగా రేషన్ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యాంశంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది.