Breaking News

గరుడ వాహనంపై కలియుగ ప్రత్యక్షదైవం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం చెందారు. వేంకటగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. సాక్షాత్తు వేంకటనాథుడే తన అనుంగు వాహనంపై తమను దీవించేందుకు రావడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సేవలో మూల విరాట్‌ని అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీవేంకటేశ్వర సహస్రమాల… తదితర వెలకట్టలేని ఆభరణాలతో ఉత్సవమూర్తిని అలంకరించడం విశేషం. గరుడునిపై మలయప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం.

సౌపర్ణుడు అంటే విశేషమైన రెక్కలు కలవాడు. తన తల్లి వినత దాస్యాన్ని అంతంచేసేందుకు అమృతభాండం తెచ్చిన కార్యశీలి. పక్షుల్లో రాజు వంటివాడు. అందుకే శ్రీమహావిష్ణువు గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు. వైకుంఠంలో ఉన్న క్రీడాద్రిని భువిపై తీసుకువచ్చిన మహాబలవంతుడు. వైష్ణవాలయాల్లో మూలవిరాట్‌కు అభిముఖంగా ముకుళిత హస్తాలతో గరుత్మంతుడు ఉంటాడు.

వైకుంఠంలోని క్రీడాద్రిని ఆదివరాహస్వామి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు సువర్ణముఖి నది సమీపంలోకి తీసుకువచ్చి ప్రతిష్టించాడు. అందుకనే కలియుగంలో సాక్షాత్తు వైకుంఠం నుంచి తీసుకువచ్చిన నివాసం కనుక శ్రీవేంకటేశ్వరస్వామి ఇక్కడే నివాసం ఏర్పరచుకొని తన భక్తులకు నిరంతరం దయామృతం ప్రసాదిస్తున్నాడు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *