-ఆక్వాల్యాబ్ ను ప్రారంభించిన శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వారంగంలో అగ్రగామిగా ఉన్న కైకలూరు లో ఆక్వారైతులకు ప్రభుత్వ అధికారుల సహకారం మరింత అవసరమని .అధికారులు రైతులకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండి సహకరించాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. గురువారం డా.వై.ఎస్.ఆర్ జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం సందర్భంగా కైకలూరు లో ఆధునిక హంగులను సంతరించుకున్న ఆక్వా ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లోనే ఆక్వారంగంలో కైకలూరు ప్రాంతం అగ్రగామిగా ఉందని అన్నారు.అయితే రైతులకు సహాయం అందించే ప్రభుత్వ ఆక్వాలాబ్ సేవలు సకాలంలో అందడం లేదన్నది సుస్పష్టం అన్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ప్రయివేట్ ఆక్వా ల్యాబ్ లు పెరగడానికి ఇదే కారణం అన్నారు.ప్రభుత్వ అధికారులు రైతులకు అవసరమైన వేళల్లో తమ విధులు నిర్వహిస్తే పరిస్థితి మరింత మెరుగై రైతుకు మేలు జరుగుతుందని అన్నారు. ఈరోజు కైకలూరు లో ఆక్వాల్యాబ్ ను రూ.18 లక్షల 60 వేల వ్యయంతో ఆధునిక హంగులతో అభివృద్ధి చేసుకుని ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం అన్నారు. రైతులకు ఈసేవలు అనుక్షణము అందుబాటులో అందితే మంచి జరుగుతుందన్నారు.అనంతరం కార్యక్రమం శిలాఫలకాన్ని ఆవిష్కరించి,ల్యాబ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
కార్యక్రమంలో ఏడీలు,ప్రతిభ,వర్ధన్,సర్పంచ్ డీఎం నవరత్నకుమారి, జడ్పీటీసీ అభ్యర్థి కురేళ్ళ బేబీ, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, ఎస్ఐ షణ్ముఖ సాయి, ఎఫ్డీవోలు గణపతి,ఈశ్వర చంద్ర,ల్యాబ్ ఇన్సపెక్టర్ హేమ చంద్ర,ఈవో లక్ష్మినారాయణ, నాయకులు నిమ్మల సాయిబాబు,జక్క శివాజి, సమయం అంజిబాబు, అబ్దుల్ హమీద్, దండే రవిప్రకాష్,తదితరులు పాల్గొన్నారు.
Tags kikaluru
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …