-బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్ డా పూర్ణచంద్ర రావు
-ఒక్క రోజు వాళ్ళు ఓట్లు అడుక్కుంటారు, ఐదేళ్లు మనం మనుగడ కోసం అడుక్కుంటున్నాం, ఈ పరిస్థితి మారాలంటే బీసీ ఎమ్యెల్యే, ఎంపీల సంఖ్యా పెరగాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు కాన్షిరాం లేకపోతే దేశంలో బడుగు, బలహీన, బీసీ వర్గాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని, నేడు పోరాటం చేసే స్థాయికి మనం చేరగలిగామంటే అది కేవలం కాన్షిరాం చలవే అని, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు ఆవేదన వ్యక్తం చేసారు. మంగళవారం కులగణన డిమాండుతో, కాన్షిరాం వర్ధంతి నాడు, విజయవాడలో బీఎస్పీ ఆధ్వర్యంలో, బీసీ రాష్ట్రవ్యాప్త సంఘాల మహాధర్నాలో వారు ప్రసంగిస్తూ ఇలా అన్నారు.
నాడు కాన్షిరాంగారు బీసీల రాజ్యాధికాసారం, హక్కుల సాధన కోసం మొదలుపట్టిన సమరం నేడు కులగణన డిమాండ్ తో కీలకఘట్టం చేరుకుంది. ఇక తప్పించుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవు. మొన్నటికి మొన్న, తెదేపా తన మానిఫెస్టోలో బీసీలకు చట్టసభల్లో 33, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. మరి అది సాకారం కావాలంటే, కోర్టుల్లో కొట్టేయకుండా నిలవాలంటే ఖచ్చితంగా కులగణన చేయాలి. ఎందుకు కులగణన చేయకుండా, సర్వేలు, నైపుణ్య గణనలు అంటూ నాటకాలు చేస్తున్నారు, ఎందుకంటే లెక్కలు తేలి వీరి బండారం బయటపడుతుందనా? కృష్ణ, గుంటూరు జిల్లాలే తీసుకోండి, జనాభా ప్రకారం కమ్మవాళ్ళు ఎంతమంది, బిసిల ఎంతమంది. కానీ ఎమ్యెల్యేలు, ఎంపీలు అన్నీ వారే. వేరే కులాలే లేవా? ఈ పరిసితి మారాలంటే కులగణన వెంటనే చేపట్టాలి.
ఇక ఉపేక్షించేది లేదు, కులగణన చేస్తారా, లేక బీసీల ఆగ్రహం చవిచూస్తారా? ఒక్క రోజు ఓటు వాళ్ళు అడుక్కుంటే, దశాబ్దాల పాటు మన మనుగడ కోసం మనం చెయ్యిచాచాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చుదాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఏకమవ్వాలి, ఒకరికి ఒకరు నిలవాలి, రాజ్యాధికారం సాధించాలి. బీసీ సీఎం సంగతి సరే మేము కోరేది బీసీ ఎమ్యెల్యేలు, ఎంపీలు దామాషా పద్దతిలో పెరగాలి
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి మాట్లాడుతూ, ఇక కులగణనపై ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని, అనాదిగా జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం కులగణనతోనే సాధ్యమని చెప్పారు. కులగణన చేయకపోతే బీసీలు ఈ సర్కారులను ఖచ్చితంగా దింపుతారని అయన సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఎస్పీ నాయకులు బందెల గౌతమ్ కుమార్, ఎల్ వందన్ కుమార్, బి పుష్పరాజు లు పాల్గొన్నారు.రాష్ట్ర బి సీ సంఘం నాయకులు కేశన శంకరరావు, వై. కే, శ్రీ అంగడాల పూర్ణచంద్రరావు, వరగాని ఏడు కొండలు, మేకా వెంకటేశ్వర్లు గౌడ్, లక్ష్మీనారాయణ, శివ ప్రసాద్, గోవిందు, కె.తిరుపతి రావు తదితరులు పాల్గొనగా, రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షులు దాసరి రాము విచ్చేసి ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.