-భృణ హత్యలను తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది
-రెవెన్యూ డివిజన్ అధికారి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సాంస్కృతిక విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లతో లింగ వివక్ష ఏర్పడిందని, భృణ హత్యలకు పాల్పడినా, ప్రోత్సహించినా అటువంటి వారి విషయాల్లో చట్టపరంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రాజమండ్రి రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో PCPNDT చట్టం 1994 కి లోబడి ఉప జిల్లా స్థాయి మల్టీ మెంబర్ & సబ్ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశానికి రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షత పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆర్డీవో కృష్ణ నాయక్ మాట్లడుతూ, నేడు ఆధునిక కాలంలో కూడా బాలికల వ్యతిరేక, మగ పిల్లలు కావాలనే పక్షపాతంతో ఉండడ మనేదానికి హద్దు లేకుండ పోయిందన్నారు. ఆ కట్టుబాట్లనే సవాళ్ళను ఎదుర్కొని, ఇటువంటి అనాచారాలను తప్పని సరిగా రూపు మాపాల్సిన సామాజిక బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఆడశిశువులను వద్దనుకోవడం అనే అభ్యాసాలు భారతదేశంలో గల సామాజిక ,ఆర్ధికపరమైనవిగా ఆపాదించడం జరుగుతోంది. భారత దేశంలో జరిగిన అధ్యయనాలు ఆడ శిశువులను వద్దనుకోవడానికి మూడు కారణాలను గుర్తించి నట్లు,ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన అంశాలు గా పేర్కొన్నారు. దేశ జనాభాలోయం కోల్పోతే విపరీతమైన పరిణామాలు చేసుకుంటాయన్నారు. స్కానింగ్ కేంద్రాలలో ఎక్కడైనా లింగ నిర్దరణ తెలియజేసినచో అట్టి కేంద్రాలను మూసివేయడంతో పాటు సంబంధిత డాక్టరుకు జైలుశిక్ష కూడా పడే అవకాశాలు చట్టాల్లో పొందుపరచడం జరిగిందన్నారు. డివిజన్ పరిధిలో విధిగా లింగనిర్ధరణ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భ్రూణ హత్యలు నివారించడంపై తీసుకొనవలసిన చర్యల పై సమావేశంలో చర్చించడమైనది. ప్రతినెలా నిర్దిష్ట లక్ష్యాల సాధనకు స్కాన్ సెంటర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికార్లను అదేశించినారు.
ఈ సమావేశంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, రాజానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం ఐసిడిఎస్ అధికారులు , ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి గైనకాలజిస్ట్ , శిశువైద్యుడు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.