Breaking News

ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ గెలుపు ఖాయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎమ్మెల్సీ ఓటు న‌మోదు పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం
-హాజ‌రైన ఎన్డీయే కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరం తెలుగు దేశం పార్టీ కి కంచుకోట లాంటిది.ఎన్డీయే కూటమి బలపర్చిన ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా గ్రాడ్యు యేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయం..ఈస్ట్ నుంచి 40 వేల ఓట్ల మెజార్టీ వ‌స్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ చెప్పారు.ఎన్డీయే కూటమి బలపర్చిన ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా గ్రాడ్యు యేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయంలో ఎన్డీయే నాయకులు కార్యకర్తల కు గ్రాడ్యు యేట్స్ ఎమ్మెల్సీ ఓటు నమోదు పై అవగాన కార్యక్రమం జ‌రిగింది. ఈకార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిధిగా ఎంపి కేశినేని శివ‌నాథ్ హాజ‌ర‌య్యారు.

ఈ స‌మావేశంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎక్కువ మంది పట్టభద్రులు ఉన్న ఈస్ట్ నియోజకవర్గం లో 50 వేల ఓట్లు నమోదు చేసేందుకు కృషి చేయాలని ఎన్డీయే కూటమి యువ నేత‌ల‌కు, కార్యకర్తలకు ఎంపి కేశినేని శివ‌నాథ్ పిలుపునిచ్చారు. అధికారం లో ఉన్నామనే ధీమాతో కాకుండా జాగ్రత్త గా సాధారణ ఎన్నికల మాదిరిగా ఓట్లు నమోదు తర్వాత పోలింగ్ మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. తూర్పు నియోజకవర్గం లో విజయోత్సవ సభ దసరా, దీపావళి పండగల తర్వాత‌ నిర్వహిస్తామని ఎం.పి కేశినేని శివ నాథ్ ప్ర‌క‌టించారు.

చంద్రబాబు నాయుడు సి.ఎం అయ్యాక రాష్ట్రంలో ఎన్నో మార్పులు తెచ్చారన్నారు. తిరుపతి, దసరా ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. చాలా మంది ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేసుకోవడం లేదు, దాని బాధ్యతను కూటమి శ్రేణులు తీసుకుని న‌మోదు చేయించాల‌న్నారు. ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్ చేసిన త్యాగానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిద్దామని శ్రేణులను కోరారు

అంత‌కు ముందు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ ఆలపాటి రాజా, తాను 1994లో ఎమ్మెల్యేలుగా తొలిసారి గెలిచామని, ఆనాటి నుంచి కూడా ఆయనతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. గత వైకాపా పాలనలో టిడిపి శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతుంటే చంద్రబాబుకు అత్యంత దగ్గరగా ఉండి, న్యాయ విభాగానికి నాయకత్వం వహించి కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు. తెనాలి సీటు ఆయనకు రాకపోయినప్పటికీ నిరుత్సాహపడకుండా నాదేండ్ల మనోహర్ గెలుపుకు కృషి చేశారు. ఆయన్ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూటమి శ్రేణులపై ఉ ౦దన్నారు.

ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి శ్రేణులు కసితో పనిచేసి రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించారన్నారు. గత పాలనలో వైపిసి వారు మాటల్లో భావదారిద్యం, భాషా దారిద్యంతో ప్రజలు సిగ్గుపడ్డారన్నారు. 151 మంది వైకాపా ఎమ్మెల్యేలు గాంధారీ పుత్రులుగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏనాడు లేని విధంగా ప్రజలు తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. వరదల్లో చంద్రబాబు ఒక యువకుడిలా పనిచేసి 12 రోజుల్లో విజ‌య‌వాడ న‌గ‌రాన్ని సాధార‌ణ స్థితికి తీసుకువచ్చారన్నారు.

అప్పడు బయటకి రాని వైకాపా వారు మళ్ళీ రోడ్లపైకి వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారన్నారు. పదవులు లేకపోయినా పార్టీయే తమదని భావించి వెన్నుదన్నుగా నిలిస్తున్న శ్రేణలంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకు కృషిచేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ ఆలపాటి రాజా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి అయినప్పటికీ ఎక్కడా కూడా బేష‌జానికి పోకుండా తెనాలిలో నాదెండ్ల గెలుపుకు కృషిచేశారన్నారు. ఆలపాటి రాజా తమ జనసేన పార్టీకి సీటు త్యాగం చేశారని వారి త్యాగానికి ప్రతిఫలంగా రాజాను గెలిపించుకునే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు.

జిల్లాపరిషత్ మాజీ ఛైర్మ‌న్ గద్దె అనురాధ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఆలపాటి రాజా గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. జనరల్ ఎన్నికల్లో ఎంత ఉత్సాహంగా పనిచేశారో అంతే ఉత్సాహంగా ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించి, గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, బిజెపి నాయ‌కులు పోతంశెట్టి నాగేశ్వరరావు, టిడిపి నాయ‌కులు గద్దె క్రాంతికుమార్, .పొట్లూరి ద‌ర్షిత్ తో పాటు పలువురు కార్పొరేటర్లు, టిడిపి, జనసేన, బి.జె.పి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *