అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం నియోజకవర్గం లోని పలు సమస్యలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై మంత్రి నారా లోకేష్ కు వివరించారు. వరదల కారణం గా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి రూ.14,26,821 చెక్ ను లోకేష్ కు అందచేశారు. ప్రతిష్టాత్మకమైన ఐఐఐటి హైదరాబాద్ శాఖను గన్నవరం లో నెలకొల్పాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ శాఖ ఏర్పాటు ద్వారా గన్నవరం అభివృద్ధి గణనీయంగా వేగవంతం అవ్వటం తో పాటు రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఎంపీపీ స్కూల్ విద్యార్థులు తరగతి గదులు అధ్వానంగా ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీలైనంత త్వరగా నాలుగు తరగతి గదులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గం లోని పలు పాఠశాల ల అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. యార్లగడ్డ వినతికి సానుకూలం గా స్పందించిన లోకేష్ తదుపరి సమావేశం లో చర్చించి ఐఐఐటి ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల తరగతి గదుల నిర్మాణం కు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పని తీరును ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అభినందించారు .
Tags amaravathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …