గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న కార్యక్రమాల స్టడీ టూర్ లో భాగంగా బుధవారం బాసుఘై మున్సిపల్ కార్పోరేషన్ లోని ఒడిస్సా అర్బన్ అకాడమిలో వివిధ ప్రాజెక్ట్ లను పరిశీలించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మరియు బృందం. ఈ సందర్భంగా కమిషనర్ గారికి ఒడిస్సా అర్బన్ అకాడమీలోని వికేంద్రీకృత ఘన మరియు వ్యర్ధాల నిర్వహణ సెంటర్, మల వ్యర్ధాల శుద్ధి కేంద్రాల పని తీరుని స్థానిక అధికారులు వివరించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్, వ్యర్ధాల నుండి ఇతర ఉత్పత్తుల తయారీ ప్లాంట్, వ్యర్ధాలతో కంపోస్ట్ తయారీ యూనిట్లను పరిశీలించిన కమిషనర్ బృందం ప్లాంట్ ల నిర్వహణకు ఖర్చులు, కార్మికులు, యంత్రాల సామర్ధ్యం స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …