Breaking News

భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ నిరంతర పర్యవేక్షణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ నిరంతర పర్యవేక్షణ. మీడియా పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో అత్యంత విశేషమైన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున శ్రీ కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎంతో విశేషమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల భోగాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈరోజు తెల్లవారుజామున ఉ. 12.50 గం. నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం ప్రారంభించడం జరిగిందని ఆమె అన్నారు. మూల నక్షత్రం రోజు రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగిందని ఆమె అన్నారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐదు క్యూలైన్ల ద్వారా నిరంతరం దర్శనం కలిగించడం జరుగుతుందని ఆమె అన్నారు. కొండ దిగువన వినాయకుడి గుడి వద్ద నుంచి కొండపై భాగం వరకు మూడు క్యూలైన్ల ద్వారా ఒకే క్యాటగిరి లో భక్తులకు సర్వ దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. నేటి ఉదయం 11 గంటల వరకు సుమారు 54,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారని గంటకు సుమారు 7,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారని ఆమె అన్నారు. క్యూలైన్లలో చిన్నపిల్లలకు, వృద్ధులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందజేయటం జరుగుతుందని చండిబిడ్డ తల్లులకు పాలు అందిస్తున్నామని ఆమె అన్నారు. వికలాంగులు నడవలేని వృద్ధులకు వీల్ చైర్ ద్వారా పోలీస్ సేవాదళ్ సిబ్బంది స్వయంగా దర్శనం చేయించివస్తున్నారని ఆమె అన్నారు. సామాన్య రోజులలో మాదిరిగానే ఈరోజు కూడా దర్శనం సాఫీగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. సామాన్య భక్తుల దర్శన మే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని ఆమె అన్నారు.

నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ నాటి నుండి నేటి వరకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన అన్నారు. విశేషమైన మూలా నక్షత్రం రోజు కూడా ఎక్క డా ఆగకుండా దర్శనం సాఫీగా చేసుకునేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన అన్నారు. మూలా నక్షత్రం ఒక్కరోజే ఉదయం 11 గంటల వరకు సుమారు 54 వేల మంది భక్తులు గంటకు సుమారు 7 వేల మంది భక్తులు దర్శించుకోవడం చాలా విశేషమని ఆయన అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *