Breaking News

యేర్పాట్లు భేష్…

-క్యూ లైన్ లలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర హోంశాఖ మాత్యులు  వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అమ్మవారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం రోజు నుండి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అని అన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పటిష్ట చర్యలు తీసుకున్నామని ఆమె అన్నారు. కొండ దిగవ నుంచి పైవరకు ఉన్న భక్తుల క్యూ లైన్ లను పరిశీలించుకుంటూ భక్తుల కు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నానని, ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించే దిశగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆమె అన్నారు. శరన్నవరాత్రులలో అత్యంత విశేషమైన మూలా నక్షత్రం రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రద్దీని నియంత్రించేందుకుగాను తాము ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసామని ఆమె అన్నారు. క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం సాఫీగా జరుగుతుందని భక్తులు తమతో స్వయంగా అనటం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆమె అన్నారు. తాను కూడా సామాన్య భక్తురాలు వలె అంతరాలయంలోనికి వెళ్లకుండా సాధారణ దర్శనం చేసుకున్నానని ఆమె తెలిపారు. నేడు రికార్డు స్థాయిలో ఉదయం 11 గంటల వరకు 54,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో విశేషమని ఆమె అన్నారు. సామాన్య రోజులలో త్రాగునీరు మజ్జిగ పాలు వంటి అన్ని వసతులు కల్పించడం జరిగిందని ఎక్కడా ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించామని ఆమె అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *