Breaking News

మెప్మా డిజిటల్ మార్కెటింగ్


-ONDC(ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ద్వారా ఆన్లైన్ లో మెప్మా SHG ఉత్పత్తులు
-మెప్మా బజారు, SARAS ఎక్సిబిషన్ ద్వారా సూక్ష్మ మరియు చిన్న తరహా ఉత్పత్తిదారులకు ప్రోత్సాహం
-స్వర్ణాంధ్ర @ 2047 లో భాగంగా మహిళల ఆర్ధికాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతుందన్న మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా పట్టణాలలోని స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశ వ్యాప్తంగా ఆన్లైన్ మార్కెట్ ద్వారా అమ్మటానికి డిజిటల్ మార్కెటింగ్ లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

హ్యాండిక్రాఫ్ట్ , టెక్స్ టైల్స్, జ్యూలరీ, ఫుడ్ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ-కామర్స్ ONDC (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) వేదికగా ద్వారా పట్టణాలలోని స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయిస్తుంది. తద్వారా సూక్ష్మ మరియు చిన్న తరహా ఉత్పత్తిదారులు సైతం డిజిటల్ విప్లవంలో భాగస్వామ్యులు అయ్యి వారి యొక్క ఆదాయ మార్గాలు పెంచి వారి జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు మెప్మా గౌరవ మెప్మా మిషన్ డైరెక్టర్  ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ వినూత్న రీతిలో కృషి చేస్తున్నారు.

ఇందుకు గాను ONDC డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా మెప్మా గడిచిన నెల రోజులలో 1300 పై చిలుకు స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్ లో అమ్మటానికి సిద్దం చేసి తద్వారా 445 ఉత్పత్తులను రూ.85000/- (ఎనభై అయిదు వేల రూపాయలు) ఈ రోజు వరకు విజయవంతంగా అమ్మకాలు జరిగినవి.

స్వయం సహాయక సంఘాల ఆదాయ మార్గాలు మరింత మెరుగు పరచటానికి ఆన్లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మునిసిపాలిటీ మరియు కార్పొరేషన్ పరిధిలో నెలకు రెండు రోజుల పాటు “మెప్మా బజారు” లను ఏర్పాటు చేసి SHG ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకం చేపడుతుంది. ప్రతి కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా డిజిటల్ లావాదేవీలు నిర్వహించేలా అవగాహన కల్పించడం తో పాటు డిజిటల్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది.

అంతేకాకుండా కొన్ని ప్రత్యెక సందర్భాలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా జరిగే “సరస్” ఎక్సిబిషన్లలో వారిని ప్రోత్సహిస్తూ వారి ఉత్పత్తుల అమ్మకానికి మెప్మా దోహద పడుతూ ఆర్ధిక స్వావలంబన దిసిగా అడుగులు వేస్తుంది.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *