విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేద వాడికి పక్కా గృహం నిర్మించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ బత్తుల.తాతయ్య బాబు తెలియచేసేరు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ గా నియమితులైన తాతయ్యబాబు గురువారం విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన పదవీ భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అన్ని సౌకర్యాలు తో గృహాలు నిర్మించాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ధ్యేయమని,ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా గృహాల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. గత ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు లేకుండా గృహనిర్మాణాలు చేపట్టేరని, రహదారులు విద్యుత్,మంచినీరు తదితర సౌకర్యాలుతో పేదవాళ్ళు సౌకర్యవంతంగా జీవించే విధంగా కూటమి ప్రభుత్వం గృహాలను నిర్మిస్తుందని ఆయన తెలియచేసేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవంతో పేదలకు మంచి జరిగే విధంగా అనేక పధకాలు అమలు చేస్తారని, ఇప్పటికే పలు పధకాలు అమలుకు శ్రీకారం చుట్టేరని, దీపావళి నుంచి ఉచిత గాస్ సిలిండర్ల పంపిణి ప్రారంభం అవుతుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వహయాం లో బ్రస్టు పట్టిన వ్యవస్థలను తిరిగి గాడి లో పెట్టి రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని తాతబాబు పేర్కొన్నారు.
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి.అనిత, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీ.ఎం.రమేష్, శాసనసభ్యులు కే,ఎస్.ఎన్.రాజు, బండారు.సత్యనారయణమూర్తి, యార్లగడ్డ.వెంకట రావు, సుందర.విజయ కుమార్, రాష్ట్ర పట్టణఆర్ధిక సంస్థ చైర్మన్ పిలా.గోవిందసత్యనారాయణ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కే.రాజబాబు, తెలుగుదేశం పార్టీ నాయుకులు, పలువురు అధికారులు చైర్మన్ను కలిసి పుష్ప గుచ్చాలు ఇచ్చి చైర్మన్ తాతబాబును అభినిందించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …