అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటాకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, అధికారులు మరియు సిబ్బంది నివాళులు అర్పించారు. గురువారం మంగళగిరి పరిశ్రమల శాఖ కమీషనర్ కార్యాలయంలో రతన్ టాటా చిత్రపటానికి నివాళులు అర్పించిన డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రతన్ టాటా వారితో తాను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా ఎంతో గొప్ప వ్యక్తని, గ్లోబల్ పేస్ అఫ్ ఇండియాను మార్చిన మహోన్నతుడని, అంతేగాక జీవితం చివరి వరకు విలువలు పాటించిన వ్యక్తిగా ఎంతో సాధారణ జీవితం గడిపారని చెప్పారు. భారతదేశంలో పారిశ్రామిక రంగ ఎదుగుదలకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ప్రఖ్యాత టాటా మెమోరియల్ హాస్పిటల్ మరియు అనేక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ ని స్థాపించి వివిధ కార్యక్రమాల రూపంలో సమాజ సేవకు ఆయన చేసిన సేవలను పొగిడారు.తన జీవితమంతా టాటా పరిశ్రమకు మరియు భారతదేశంలోని అనేక మంది జీవితాల సంక్షేమం కోసం అంకితం చేశారు అని కొనియాడారు. ఆయన మరణం భారతదేశానికి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధించారు.
Tags amaravathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …