-విజేతలకు మెడల్స్ అందజేసిన రాష్ట్ర రవాణా,యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో యోనేక్స్ సన్ రైస్ కాలగార నాగబాబు మెమోరియల్ వారు ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ 2024 కార్యక్రమానికి రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్యాట్మెంటన్ ఆటల పోటీలను వీక్షించారు. అండర్ 16 – 17 లో గెలుపొందిన క్రీడాకారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు పతకాలు, సర్టిఫికెట్ లను అందజేశారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ని,శాప్ చైర్మన్ రవి నాయుడుని ఘనంగా సన్మానించారు.