-ఒకటి కొంటే మరొకటి ఉచితం.. మరియు ఒకటి కొంటే రెండు ఉచితం…
-ఆప్కో డియంఓ యస్ వివి. ప్రసాద రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఆప్కో షోరూమ్ లలో 30 శాతం రాయితీ పై చేనేత వస్త్రాల అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ఆప్కో డివిజినల్ మార్కెటింగ్ మేనేజరు యస్ వివి. ప్రసాద రెడ్డి తెలిపారు. చేనేత వస్త్రాలను వినియోగదారులకు అందుబాటులోనికి తీసుకువచ్చి నేతకార్మికులకు చేయూతనిచ్చేందుకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆప్కో షోరూమ్ ల ద్వారా 30 శాతం రిబేటు సౌకర్యం కల్పించడంతో పాటు ఒకటి కొనుగోలు చేస్తే మరొకటి ఉచితం మరియు ఒకటి కొంటే రెండు ఉచితం స్కీమ్ ను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ధర్మవరం, వెంకటగిరి, మాధవరం, ఉప్పాడ పట్టుచీరలు, వెంకటగిరి, ఉప్పాడ, బందరు, రాజమండ్రి, మంగళగిరి కాటన్ చీరలు, చీరాల ఫ్యాన్సీ డ్రస్ మెటీరియల్స్ దుప్పట్లు, టవల్స్, లుంగీలు, ధోవతులు షోరూమ్ లలో అమ్మకాలకు సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఏలూరు రోడ్ రామమందిరం సమీపంలో గల ఆప్కో మెగా షోరూమ్ నందు చేనేత వినియోగదారులను ఆకర్షించే విధంగా అత్యాధునిక డిజైన్ లతో రూపొందించిన వస్త్రాల అమ్మకాలను నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని మెగా షోరూమ్ మేనేజరు వై. గోపాలకృష్ణ ఒక ప్రకటనలో కోరారు.