విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు. అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినంగా ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడతాయని శ్రీ మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్ అధినేత డా.ఆయోధ్య ఆర్.కె, చైల్డ్-ఎడల్డ్ సైకియాట్రిస్ట్ డా. మానస కాజ స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కాజ మానస మాట్లాడుతూ ఈ వారం రోజులలో ప్రపంచవ్యాప్తంగా మానసిక వైద్యులు మరియు ఈ రంగానికి చెందిన ఇతరులు, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు,, వివిధ రంగాలలోని వ్యక్తులను ఉపన్యాసములు ద్వారా రచనల ద్వారా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ద్వారా ప్రజలకు చేరడం జరుగుతుందని ఈ సంవత్సరం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ (డబ్ల్యూ.ఎఫ్.ఎం.హెచ్) ఇచ్చిన నినాదమని అన్నారు. సహజంగా పని స్థలములో మానసిక ఆరోగ్య సమస్యలు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, డ్రగ్స్ మద్యపానం, డిజిటల్ ఎడిక్షన్స్ మరియు ఆత్మహత్యలు ఇవన్నీ వ్యక్తి యొక్క పనితనం స్కిల్స్ ను దెబ్బ తీస్తాయని ఆమె అన్నారు ప్రపంచ వ్యాప్తంగా వన్ ట్రిలియన్ యూఎస్ డాలర్స్ డిప్రెషన్ వలన నష్టపోతున్నామని, ప్రపంచవ్యాప్తంగా 12 బిలియన్ పని దినాలు కోల్పోతున్నామని ఇందులో 30% పని స్థలములోనే మెంటల్ హెల్త్ సమస్యలు వస్తున్నాయని వారు అన్నారు. దీనికి నివారణ మార్గాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …