-రేపటి నుంచి పామాయిల్ లీటర్ 110 రూపాయలు.
-వంట నూనె ధరల నియంత్రణకు చర్యలు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
-సన్ ఫ్లవర్ లీటర్ 124 రూపాయలు చొప్పున రేషన్ కార్డ్ ఆధారంగా పామాయిల్ మూడు ప్యాకెట్లు, సన్ఫ్లవర్ ఆయిల్ ఒక ప్యాకెట్లు
-ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం వంటనూనెల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది
-రాష్ట్రంలో వంటనూనె అమ్మకములో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని నిర్ణయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 11వ తేదీ నుంచి లీటర్ (850 గ్రాములు) పామాయిల్ ధర 110 రూపాయలు… రేషన్ కార్డు ఆధారంగా వినియోగదారుడికి మూడు ప్యాకెట్లు.. అదేవిధంగా సన్ ఫ్లవర్ లీటర్( 910 గ్రాములు) రేషన్ కార్డ్ ఆధారంగా ఒక ప్యాకెట్ చొప్పున ఈ నెల ఆఖరి వరకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. సివిల్స్ సప్లయిస్ భవన్ నందు వంట నూనె సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ మరియు వర్తకులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ధరల నియంత్రణ… వర్తకుల సమస్యలపై చర్చించడం జరిగింది. అదే విధంగా ఇండోనేషియా మలేషియా ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి దిగుమతులు తగ్గడం, సోయా ఎంఆర్పి ధర పెరగడం, వంట నూనె మీద డ్యూటీ టాక్స్ పెరగడం… సప్లై తక్కువగా ఉండడం, ప్యాకింగ్ చార్జీలు పెరగడం వంటి అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ వీర పాండ్యన్ ఐఏఎస్, సివిల్ సప్లై ఎండి మనజీర్ జిలాని ఐఏఎస్, సివిల్ సప్లైస్ అధికారులు. మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మరియు వర్తకులు తదితరులు ఉన్నారు.