విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా తొమ్మిదవ రోజు అనగా 13/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉదయం జనరల్ అభ్యర్థులకు, మధ్యాహ్నం మైనర్ మీడియా అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 19576 మందికి గాను 17272 మంది అభ్యర్థులు అనగా 88.23 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 44 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 12637 మందికి గాను 11165 మంది అనగా 88.35- శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 40 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ మైనర్ మీడియా అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 6939 మందికి గాను 6107 మంది అనగా 88.01 శాతం మంది హాజరయ్యారు. తొమ్మిదవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. అభ్యర్థులు వీలైనంత ముందుగా తమ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థుల సూచనలు క్షుణ్ణంగా చదివి అర్ధం చేసుకోవాలి. పరీక్షా సమయానికి ఒకటిన్నర గంటలముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి ఏవైనా సందేహాలు వున్నట్లైతే డిపార్ట్మెంటల్ అధికారిని సంప్రదించాలి అని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం.వి. కృష్ణారెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేసారు .
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …