మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మద్యం షాపులకు ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వేలం పాటలు నిర్వహించుటకు ఎక్సైజ్ స్టేషన్ల వారీగా వివిధ శాఖల జిల్లా అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక హిందూ కళాశాల పీజీ సెంటర్, ఎంబీఏ బ్లాక్ నందు జిల్లాలో ఎక్సైజ్ స్టేషన్ల వారీగా 8 కౌంటర్లు ఏర్పాటు చేసి, ఒక్కొక్క కౌంటర్ కు పరిశీలకులను నియమించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేలం పాటల నిర్వహణ పారదర్శకంగా నిష్పక్షపాతంగా పటిష్టవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
మచిలీపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ కౌంటర్ నెంబర్-1 కు పరిశీలకులుగా జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఎం ఫణి ధూర్జటి,
బంటుమిల్లి ఎక్సైజ్ స్టేషన్ కౌంటర్ నెంబర్- 2 కు జెడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్,
అవనిగడ్డ ఎక్సైజ్ స్టేషన్ కౌంటర్ నెంబర్- 3 కు జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి,
మొవ్వ ఎక్సైజ్ స్టేషన్ కౌంటర్ నెంబర్ 4- కు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ బి.మురళి కిషోర్,
గుడివాడ ఎక్సైజ్ స్టేషన్ కౌంటర్ నెంబర్- 5 కు మార్కెటింగ్ ఏడి ఎల్. నిత్యానందం,
నందివాడ ఎక్సైజ్ స్టేషన్ కౌంటర్ నెంబర్- 6 కు వయోజన విద్య ఉపసంచాలకులు బేగ్,
ఉయ్యూరు ఎక్సైజ్ స్టేషన్ కౌంటర్ నెంబర్- 7 కు మెప్మా పిడి వెంకటనారాయణ,
గన్నవరం ఎక్సైజ్ స్టేషన్ కౌంటర్ నెంబర్- 8 కు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు షేక్ లను పరిశీలకులుగా కలెక్టర్ నియమించారు.