Breaking News

స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (SNIC) – 2024 ముగింపు

-గైట్ కళాశాలలో అక్టోబరు 2 నుంచి 13 వరకూ ఎన్ సీ సీ శిక్షణా కార్యక్రమం
-గ్రూప్ కమాండర్ పి ఎం అగర్వాల్

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరంలో జరిగిన ప్రత్యేక జాతీయ సమైక్యతా శిబిరం ముగింపు వేడుకల ముగింపు సందర్భంగా పాన్ ఇండియా శిక్షణ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడినదని ఎన్ సీ సీ కాకినాడ గ్రూప్ కమాండర్ ఆర్ ఎం అగర్వాల్ తెలిపారు. NCC Dte (AP&T) ఆధ్వర్యంలో దక్షిణ ద్వీపకల్పం లో 02 అక్టోబర్ నుండి 13 అక్టోబర్ 2024 వరకు రాజమహేంద్రవరంలోని GIET ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం 29 రాష్ట్రాలు మరియు 07 కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోని మొత్తం 17 NCC Dtes నుండి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 300 మంది సీనియర్ NCC క్యాడెట్లు ఈ 12 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతులకు హజరవ్వడం జరిగిందన్నారు. జాతీయ సమైక్యతను పెంపొందించడం ఈ శిబిరం యొక్క ప్రాథమిక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. జాతీయ సమగ్రతను పెంపొందించడానికి మరియు క్యాడెట్లలో ప్రతి రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు గొప్ప సంప్రదాయాల గురించి సాధారణ అవగాహనను పెంపొందించడానికి, క్యాడేట్ల సమాజ జీవనం విధానం పై అవగాహన , జాతీయ నిర్మాణం ఏకత్వ భావనను వారిలో పెంపొందించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ఆల్ ఇండియా NCC Dte క్యాడెట్లు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు మరియు NCC క్యాడెట్లకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ ముగింపు కార్యక్రమం కమాండింగ్ అధికారి మేజర్ కె. మహమ్మద్ ఆసిఫ్, 18(A) Bn NCC, కాకినాడ, ANOలు, PI స్టాఫ్ మరియు NCC క్యాడెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *