విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమేయా ప్రభు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు మాజీ కేంద్ర మంత్రి సురేష్ తనయులు తో ఏపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ టూరిజం కన్వీనర్ డాక్టర్ తరుణ్ కాకాని. రాష్ట్ర పురోగతి కోసం రోడ్మాప్ తయారుచెయ్యటం జరిగింది. ఈ సమావేశం లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య ఒప్పందం కుదిరింది. భారత దేశం లో టూరిజం రంగం జీడీపీ లో మరియు సస్టైనబుల్ ఎంప్లాయిమెంట్ లో ముందు వరసలో ఉంది అని, ఏపీ లో టూరిజం ని ఇండస్ట్రీ గా ప్రకటించారని, భారత దేశం లో కూడా ఇన్క్రెడిబుల్ ఇండియా తో ఇంబౌండ్ టూరిజం పెంచాలని తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, స్కిల్ గ్యాప్ ని అడ్రస్ చెయ్యాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ క్యాబినెట్ (రైల్వే) మంత్రి మరియు ఎపి నుండి రాజ్యసభ సభ్యులు సురేష్ ప్రభు తో పరస్పరం సంభాషించి తదనంతరం ఆయన్ని సత్కరించారు. రమేష్ నాయుడు – బిజెపి ఎపి రాష్ట్ర కార్యదర్శి, ఇతర ఛాంబర్స్ ప్రతినిధులు ఏపీ చాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర రావు, సెక్రటరీ రాజశేఖర్ బహుదొడ్డ, బీజేపీ ఏపీ స్టేట్ స్క్రిటరీ రమేష్ నాయిడు, విజయవాడ ప్రముఖ వ్యాపార వేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …