-ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోండి
-వర్షపు నీరు రోడ్లపైన నిలవకుండా డిసిల్టింగ్ పనులు ప్రారంభించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో భారీ వర్షపు సూచనలు ఉన్నందున సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత సిబ్బందిదే అని, బ్లాక్ స్పాట్లను గుర్తించి ముందుగానే డీసిల్టింగ్ ప్రక్రియని మొదలు పెట్టమని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం సాయంత్రం కమిషనర్ 8వ డివిజన్ సిద్ధార్థ నగర్ ప్రాతంలో పర్యటించి క్షేత్రస్థాయిలో డ్రైన్ లను పరిశీలించారు. అక్కడ నుండి వెంటనే జోనల్ కమిషనర్లు, శాఖాధిపతులు, సచివాలయం సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్ల తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ టెలి కాన్ఫరెన్స్లో భారీ వర్షం సూచనలు ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఈ సమాచారాన్ని అందచేయడమే కాకుండా ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న చాకింగ్ పాయింట్లను గుర్తించి వెంటనే అక్కడున్న ప్లాస్టిక్ను, ఫ్లోటింగ్ గార్బేజ్, డీజిల్టింగ్ చేసి వర్షపు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా సులువుగా వెలిపోయేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వర్షం పడక ముందే, వర్షపు నీరు నిలువ ఉండే చోట్ల ను గుర్తించి డీజిల్టింగ్ ప్రక్రియను ను మొదలుపెట్టి, ఇప్పుడు వర్షం పడిన నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో కూడా నీటి నిల్వలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం పడిన వెంటనే సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉంటూ ఫీల్డ్ లో వర్షపు నీటి నిలువలను ఎక్కడ నిలవకుండా చూసుకోవాలని, అధికారులు జోనల్ కమిషనర్లు వారి వారి ప్రాంతాలలో దగ్గరుండి పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎదుటి భారీ వర్షం వచ్చినా వర్షాన్ని మనం ఆపలేము, కానీ వర్షం వల్ల ప్రజలు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే ప్రక్రియను మనం వెంటనే మొదలుపెట్టి ప్రజలను ఇబ్బంది కలగకుండా చూసుకునే టట్టు మనం చేయగలం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కమిషనర్ అన్నారు. బుడమేరు వరదలలో, దసరా ఉత్సవాలలో సిబ్బంది పనితీరును మెచ్చుకున్నారు. ఇప్పుడు భారీ వర్షం సూచనలు ఉన్నాయి కాబట్టి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వర్షాలు పడినప్పుడు కూడా సిబ్బంది అంతే అప్రమత్తంగా ఉంటూ ప్రజలను సురక్షితంగా చూసుకోవాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొక్వల్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.