-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం సాయంత్రం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, పటమట హై స్కూల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అక్కడున్న అధికారులతో అన్నారు. ముందుగా కృష్ణవేణి కాట్ లో పర్యటించి అక్కడ జరుగుతున్న పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు, భవాని భక్తులు విడిచి పెట్టే రెడ్ క్లాత్ ను ఎప్పటికప్పుడు తీసేస్తూ పరిశుద్ధ నిర్వహణ పక్కగా జరిగేటట్టు చూసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు ప్రేవేక్షిస్తూ ఉండాలని ఆదేశాలించారు.
తదుపరి పటమట హైస్కూల్ రోడ్ లో ఉన్న అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చూసుకోవాలని ప్రజారోగ్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు, అలాగే బాత్రూంలో నిర్వహణ, నీటి సరఫరా ఇంజనీరింగ్ తదితర అంశాలు ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అన్న క్యాంటీన్ కిచెన్ లో ఉన్న ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని దగ్గరుండి పరిశీలించారు. అన్న క్యాంటీన్ స్పెషల్ ఆఫీసర్లు ఆహారంలో నాణ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొక్వల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఇతర ఇంజనీరింగ్ మరియు సానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.