గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యాన్ని అందించడానికి 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నామని, డ్రైవ్ పర్యవేక్షణకు శానిటరీ డివిజన్ల వారీగా సీనియర్ అధికారులకు పర్యవేక్షణ విధులు కేటాయించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పై విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇందులో భాగంగా నగరంలోని 22 శానిటరీ డివిజన్లకు సీనియర్ అధికారులను పారిశుధ్య పర్యవేక్షణకు విధులు కేటాయించామని తెలిపారు. అదనపు కమిషనర్, సిఎంఓహెచ్, ఎంహెచ్ఓల ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో సమగ్ర పారిశుధ్య పనులకు ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని, విధులు కేటాయించబడిన అధికారులు ప్రతి రోజు ఉదయం 5:30 గంటలకు జరిగే ప్రజారోగ్య కార్మికుల హాజరు మస్టర్ పరిశీలించాలన్నారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో పారిశుద్యంతో పాటు త్రాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను గుర్తిస్తే తక్షణం తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోవు 3 నెలల కాలంలో పారిశుధ్యంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలన్నారు. నగర ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ కి అంతరాయం కల్గిస్తున్న ఆవులను బుధవారం నుండి వెంగళాయపాలెంలోని జిఎంసి గోశాలకు తరలించి, తగిన రిజిస్టర్ లో ఆవుల వివరాలను నమోదు చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనులకు వినియోగించే వాహనాలనీ కండీషన్ లో ఉండేలా, కేటాయించిన ప్రాంతాలకు నిర్దేశిత సమయంలో వెళ్లేలా వెహికిల్ షెడ్ అధికారులు భాధ్యత తీసుకోవాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, డి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. నాగమల్లేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ రవి, మేనేజర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …