Breaking News

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు

-గాంధీజీ కన్న కలలు సాకారం గ్రామ స్వరాజ్య స్థాపన అభివృద్ది తో సాధ్యం
-ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆలోచనలతో నేడూ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ
-నేడు పల్లె పండుగ వారోత్సవాల్లో ప్రారంభం
-జిల్లాలో వ్యాప్తంగా 938 పనులని రు. 83.15 కోట్లతో చేపట్టడం జరుగుతోంది
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి*
-నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో “పల్లె పండుగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొని నేడు దాదాపు రూ.3 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్
-నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాదాపు రూ.11 కోట్లు మంజూరు చేశారని తెలిపిన మంత్రి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తో కలిసి రావిమెట్ల గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
-రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేయించుకున్న తొలి ఎమ్మెల్యే తానేనని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
-ఎర్రకాలువ ద్వారా నష్టపోయిన రైతాంగానికి త్వరలో ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదలకు కృషి
-గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని గ్రామాలు
-అక్టోబర్ 14 నుండి 20వ తేదీ వరకు వారంపాటు పల్లెపండగ వారోత్సవాలు

నిడదవోలు (తూర్పుగోదావరి జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త :
పల్లెలు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా నిడదవోలు రూరల్ మండలంలో 9 రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలంలో జిల్లా కలెక్టర్ సి. ప్రశాంతితో కలిసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దాదాపు రూ. 3 కోట్ల విలువైన పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా సింగవరం గ్రామంలో రూ.30.98 లక్షలతో ఆరు పనులు, కంశాలిపాలెంలో రూ.30 లక్షలతో ఆరు పనులు, రావిమెట్లలో రూ.23.25 లక్షలతో ఐదు పనులు, తిమ్మరాజు పాలెంలో రూ.30.02 లక్షలతో ఐదు పనులు, సూరాపురంలో రూ.20.98 లక్షలతో రెండు పనులు, కాటకోటేశ్వరంలో రూ.25.80 లక్షలతో ఎనిమిది పనులు, ఉనకరమిల్లిలో రూ. 26.20 లక్షలతో మూడు పనులు, తాడిమల్లలో రూ.32.30 లక్షలతో ఆరు పనులు, కోరుమామిడిలో రూ.32.30 లక్షలతో ఆరు పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా తొలుత సీసీ రోడ్లు, డ్రెయిన్లు వంటి పనులకు ప్రాధాన్యతనిచ్చిన కూటమి ప్రభుత్వం త్వరితగతిన అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టిందని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతామని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు పట్టాలెక్కాయని తెలిపారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) నిధులు మంజూరు చేయించుకున్న తొలి ఎమ్మెల్యే తానేనని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన వెంటనే ఉప ముఖ్యమంత్రి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దాదాపు రూ.11 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో డ్రెయిన్లు, ఆర్ అండ్ బి రోడ్లు, ఇళ్ల నిర్మాణం తదితర మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గ్రామాలను అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పంపిణీ, రూ.1600 కోట్ల రైతు బకాయిలు విడుదల వంటి కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. పెన్షన్లను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచామన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15 వేలు ఇస్తూ భరోసా కల్పిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పేద ప్రజల కంట కన్నీరు తుడిచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరొందిన ప్రధాన మంత్రి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వంతో మాట్లాడి ఎర్రకాలువ ద్వారా నష్టపోయిన రైతాంగానికి ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో అధికారులు, కూటమి నేతలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఉపాధి హామీ పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలాగా ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *