Breaking News

నేడు పిజిఆర్ఎస్ లో 120 అర్జీలు స్వీకరన

-డి ఆర్వో జి నరసింహులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 120 అర్జీలను స్వీకరించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం టూరిజం రీజినల్ డైరెక్టర్ బి స్వామి నాయుడుతో కలిసి ఆర్జిలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యల పట్ల క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి పరిష్కారం చేసే దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సంబంధిత అంశాలపై ఆర్డీవోలు సంబంధిత మండల తాసిల్దారులకు దిశా నిర్దేశం చేయాలని తెలిపారు. రెవెన్యూ 47 , వ్యవసాయ శాఖ 22 , పోలీసు 15 , పంచాయతీ రాజ్ 9 , ఇతర శాఖలకు సంబంధించిన 27 అర్జీలు స్వీకరించినట్లు తెలియ చేశారు.

స్వీకరించిన కొన్ని అర్జీలు:
ఉండ్రాజవరం మోర్తా గ్రామానికి చెందిన మద్దుగురి సుబ్బారావు 2018లో మినీ గోకులం సంబంధించి నిర్మాణం చేపట్టి ఉన్నారు సదరు నిర్మాణానికి సంబంధించి 1,50,000 బిల్లులు పెండింగ్లో ఉన్నవి. కావున సదరు మొత్తాన్ని చెల్లింపు కోసం కోరి ఉన్నారు.

కొంతమూరుకు చెందిన వేమనసేవ సర్వే నెంబరు 350/2 , 350/3 కి చెందినా ఇంటి స్థలం అమ్మడానికి సంప్రదించగా, సదరు భూమి ఎండోమెంట్ వారికీ చెందినదిగా పేర్కొన్నారు. వాస్తవానికి సదరు భూమి ని దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహించిన వేలం పాటలో  అధికారికంగా కోనుగోలు చేసిన సత్తి ఆదినారాయణ కొనుగోలు చేసి ఉన్నందున తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజమండ్రి ఎపి  పేపర్ మిల్స్ కి చెందిన మాజీ ఉద్యోగులు వి. శివ రామక్రిష్ణ తదితరులు డిపాజిట్ చేసిన మొత్తాలకి సంబంధించిన వడ్డీ నీ పేపర్ మిల్ యజమాన్యం నవంబర్ 2023 నుండి  చెల్లించడం లేదని ఫిర్యాదు చేసి యున్నారు. యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *