Breaking News

అధిక వర్షాలు కురిసే అవకాశం దృష్ట్యా వారి కోతలు చేపట్ట వద్దు

-రానున్న 4 , 5 రోజుల అత్యంత అప్రమత్తంగా ఉండాలి..
-రెవిన్యూ,వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
-క్షేత్ర స్థాయి రైతులకు అవగాహనా కల్పించాలి
-జిల్లాలో కొత్తగా జాయిన్ అయిన ఎంపిడిఓ లు తక్షణం కలెక్టర్ రిపోర్టు చెయ్యాలి
-పల్లె పండుగ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది , ఉపాధి హామీ కూలీలు తప్పని సరిగా హజరు కావాలి
-గ్రామాల్లో చేపట్టిన పనులను గోడలపై పెయింటింగ్ వేయించాలి
-మంగళవారం 3 గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమం ఆకస్మికంగా తనిఖీ చేస్తా…
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఆర్డీవో, మండల ప్రత్యేక అధికారులు , తహసిల్దార్, ఎంపిడిఓ ఇతర క్షేత్ర స్థాయి అధికారులతో అధిక వర్షాలు, తుఫాను హెచ్చరికల నేపథ్యంపై , పల్లె పండుగ, రెవిన్యూ, కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ సమావేసానికి మండలస్థాయి అధికారులు ఒక్క చోట నుంచే హజరు కావాలని ఆదేశించారు.

రెవిన్యూ డివిజనల్ అధికారులూ వర్షపాతం నమోదైన వివరాలు, రానున్న రోజుల్లో నమోదు కానున్న నేపథ్యంపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జాగ్రత్తగా గమనించి తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అధికారులు 2555 మెట్రిక్ టన్నుల ధాన్యం కోతలు జరిగినట్లు తెలుస్తోంది. ఆమేరకు ఆ ధాన్యం ఓపెన్ మార్కెట్ కు వెళ్లిందా? లేదా అన్నది ? నిర్ధారణ చేసుకోవాలన్నారు. వాటి వివరాలు ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చెయ్యాలని పేర్కొన్నారు. పి ఆర్ 126 లేదా ఇతర ఫైన్ వెరైటీ ధాన్యం అమ్మకాలు పై దృష్టి పెట్టాలని అన్నారు. గన్ని బ్యాగుల కేటాయింపులు, వాహనాల ఏర్పాటు,  హమాలీలు, ఆర్ ఎస్ కె లలో మౌలిక వసతులు పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు

పల్లె పండుగ కార్యక్రమంలో మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలని కలక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా జాయిన్ అయిన ఎంపిడిఓ లు తక్షణం కలెక్టర్ రిపోర్టు చెయ్యాలని, తదుపరి మాత్రమే విధులను నిర్వర్తించాలన్నారు. అప్పటి వరకూ విధులకి హజరు కానట్లుగా పరిగణన లోనికి తీసుకుంటానని స్పష్టం చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో చేపట్టిన పనుల వివరాలు ప్రజలకి తెలిసే విధంగా ప్రదర్శించాలని, అదే విధంగా వాల్ పెయింట్స్ చేయించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ వేతన కూలీలను ఆయా ప్రాంతాలలో జరిగే కార్యక్రమం లో పాల్గొనేలా చూడాలన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో ఆ గ్రామ స్థాయి సచివాలయ సిబ్బంది తప్పని సరిగా హజరు కావాలన్నారు. గైరాజరు అయిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి నుంచి పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి మండలం నుంచి లోతట్టు ప్రాంతాలలో, ముంపు ప్రాంతాల్లో, సమస్య ఉన్న స్మశాన వాటి అభివృద్ది చెందిన ప్రతిపాదనలు పంపాలన్నారు.

అక్టోబరు 16 నుంచి ఇసుక రీచ్ లు ప్రారంభం కానున్న దృష్ట్యా సిసి కెమెరాలు రానున్న 24 గంటల్లో ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రతి రీచ్ పాయింట్ కు 4 నుంచి 6 ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు కోసం పోల్స్ సిద్ధం చేయాలన్నారు. తదుపరి మాత్రమే ఇసుక రిచ్ వద్ద త్రవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుందన్నారు.  ఇందుకోసం ఆర్డీవో లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు, సిపివో ఎల్. అప్పలకొండ, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా పంచాయితీ అధికారి బి. శ్రీనివాస రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ ఎండీ అలీముల్లా, జిల్లా హర్టీకల్చర్ అధికారి బి. సుజాత కుమారి , తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *