గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ ల్లో శిక్షణ పొందిన పారా స్విమ్మర్ దేవేంద్ర జాతీయ స్థాయి పారా ఈత పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్లో కోచ్ ఎస్.కె. ఖాజా మొహిద్దీన్, స్విమ్మర్ దేవేంద్రలను కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత నెలలో విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 6వ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ -2024 లో గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ ల్లో శిక్షణ పొందిన పారా స్విమ్మర్ దేవేంద్ర సీనియర్ పురుషుల విభాగంలో ఎస్.5 కేటగిరిలో పాల్గొని 2 బంగారు, 1 వెండి పతకాలు గెలుచుకున్నారన్నారు. ఈ నెల 19 నుండి 22 వరకు గోవాలో జరిగే XXIV-జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్-2024 పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని, అక్కడ కూడా ఉత్తమ ప్రదర్శన చూపాలని ఆకాంక్షించారు.
Tags guntur
Check Also
మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
-మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. -ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు -పలువురు …