-పలు అభివృధికి నగర మున్సిపల్ కమిషనర్ కి ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృధికి సహకరించండని, గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులుని ఎమ్మెల్యే గళ్ళ మాధవి కోరారు. మంగళవారం గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ లో కమిషనర్ ని కలిసి పశ్చిమ నియోజకవర్గ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలు మరియు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. వీటిలో ప్రధానంగా సంపత్ నగర్ ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనీ కోరారు. అలాగే సంఘ సంస్కర్తల విగ్రహల ఏర్పాటు కోసం నియోజకవర్గంలో ఒక ఐలాండ్ ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గంలో అనేక చోట్ల వీధి దీపాలు వెలగటం లేదని వాటికి మరమ్మతులు చేయాలనీ, కొన్ని చోట్ల కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. గుజ్జనగుండ్ల లోని నాయి బ్రహ్మణ కాలనీలో “బిసి కమ్యూనిటి హాల్ నిర్మానికి సహకరించాలన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య పారిశుధ్యము అని వాటిని మెరుగుపరచటానికి కావాల్సిన సిబ్బందిని మరియు కొత్త యంత్రాలను ఏర్పాటు చేయలని కోరగా, వాటికి కమిషనర్ సానుకులంగా స్పందించారు.