విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు గొర్రెలు మేకలకు. ఉచితముగా నట్టల నివారణ మందు వేయడం జరుగుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. నట్టల నివారణ మందు వేయడం ద్వారా జీవాల బరువు పెరిగి, మరణాలు తగ్గుతాయన్నారు. రక్తహీనత నివారించబడి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. నట్టల నివారణ ముందును జిల్లాలోని ప్రతి పశు వైద్యశాలలోనూ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. 15 రోజుల కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది గొర్రెలు మరియు మేకలకు ఉచితంగా మందులను వేయడం జరుగుతుందని జిల్లాలోని గొర్రె, మేకల పశుపోషకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు హనుమంతరావు ఆ ప్రకటనలో కోరారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …