Breaking News

డీఎస్సీ ఉచిత శిక్ష‌ణ‌కు ఈ నెల 21లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

-జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస‌రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఉత్త‌ర్వుల మేర‌కు ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థుల‌కు ఉచిత డీఎస్సీ శిక్ష‌ణ అందించ‌డం జ‌రుగుతుంద‌ని.. ఇందుకు https://jnanabhumi.ap.gov.in/ (జ్ఞాన భూమి) వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 21లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస‌రావు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సిక్స్ స్టెప్ వెరిఫికేష‌న్ కూడా ఆయా స‌చివాల‌యాల్లో జ‌ర‌గాల్సి ఉంటుంద‌ని.. ఈ నెల 27న నిర్వ‌హించే స్క్రీనింగ్ ప‌రీక్ష‌లో మెరిట్ అభ్య‌ర్థుల‌ను అర్హ‌త ప్ర‌కారం ఉచిత శిక్ష‌ణ‌కు ఎంపిక‌చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.
ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రెసిడెన్షియ‌ల్ విధానంలో ఉచిత డీఎస్సీ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో ఎంప్యానెల్‌మెంట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే శిక్ష‌ణ సంస్థ‌లు క‌నీసం గ‌త రెండు డీఎస్‌సీ రిక్రూట్‌మెంట్లకు శిక్ష‌ణ ఇచ్చి ఉండ‌టం, గ‌త డీఎస్సీ నియామ‌కాల్లో కనీసం వంద మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందియుండ‌టం త‌దిత‌ర అర్హ‌త‌లు ఉండాల‌న్నారు. ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ డాక్యుమెంట్ నెం.757795ను ఏపీ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్ట‌ల్‌లో అప్‌లోడ్ చేయ‌డం జ‌రిగింద‌ని.. ఆస‌క్తి ఉన్న శిక్ష‌ణ సంస్థ‌లు ఈ నెల 21లోగా ఈ డాక్యుమెంట్‌ను చేసుకోవాలని సూచించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *