-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు, కాలుష్య రహిత నగరానికి ఆ ఆ రంగం నిపుణులతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రధాన కార్యాలయంలో తమ చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేస్ట్ వాటర్ ప్రాసెస్,పారిశుద్ధ్య నిర్వహణ మరియు నగరాభివృద్ధి దిశగా చర్చించారు. కాలుష్య రహిత సమాజానికి తీసుకోవాల్సిన చర్యలు, పారిశుధ్య నిర్వహణకి మెరుగైన వసతులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కాస్మిక్ హిలోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ, కేజీ ఎంపీ పార్ట్నర్స్, ఎస్ ఈ (ప్రాజెక్ట్స్) సత్య కుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్చార్జ్ డాక్టర్ సురేష్ బాబు ఎకౌంట్స్ ఆఫీసర్ బి.సత్యనారాయణ పాల్గొన్నారు.