మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్బన్ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన గుంటూరు అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు లాకర్లు డిపాజిట్లు రుణాల విభాగాలను క్యాష్ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం వినియోగదారులకు తనదైన శైలిలో మెరుగైన సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి బ్యాంక్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, బ్యాంకు చైర్మన్ బోనబోయిన శ్రీనివాస యాదవ్, వైస్ చైర్మన్ ఎం బసివి రెడ్డి, డైరెక్టర్లు కే రామారావు, ఎస్ కే సైదా, ఆర్ భాస్కరరావు, సీఈవో ఎం. సంజీవరావు, డిప్యూటీ సీఈవో కే.అప్పారావు, అసిస్టెంట్ మేనేజర్ వై. నాగార్జున, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ బండ్రెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …