-అధికారులు సమన్వయంతో శాఖల వారి కేటాయించిన ఏర్పాట్లు పటిష్టవంతంగా నిర్వహించాలి.
-హారతి కి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించాలి.
-పురపాలక సంఘం అధికారులు త్రాగునీరు, శానిటేషన్ పక్కాగా నిర్వహించాలి.
-ఆర్డీవో సుస్మిత రాణి
-దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పగడాల ఆనంద తీర్థ ఆచార్యులు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఏడాది గోస్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి ఉత్సవంలో భాగంగా నవంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహించే గోదావరి మహా నీరాజనం, మహా హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆర్డీవో సుస్మిత రాణి తెలిపారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలోఆర్డీవో సుస్మిత రాణి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పగడాల ఆనంద తీర్థ ఆచార్యులుతో కలసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో సుస్మిత రాణి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా గోష్పాద క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి కార్యక్రమాన్ని నవంబర్ 4వ తేదీ న నిర్వహించడం జరుగుతుందన్నారు. హారతి ఇచ్చే రోజున ఉత్సవ విగ్రహాలు వస్తాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున సుమారు పదివేల పైబడి హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వస్తారని, ఇందుకు సంబంధించి మత్స్యశాఖ, విద్యుత్, అగ్నిమాపక, ఇరిగేషన్, పోలీస్, దేవాదాయ ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఆయా శాఖలకు కేటాయించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని ఆదేశించారు.
దాస సాహిత్య ప్రాజెక్ట్ అధికారి పగడాల ఆనంద తీర్థ ఆచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో దక్షిణ గంగగా పిలవబడే పవిత్ర గోదావరి నదమ్మ తల్లికి అందించే ఆత్మీయ హారతి కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.
నవంబర్ 4వ తేదీ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని కొవ్వూరు పట్టణం పవిత్ర గోదావరి నది తీరం గోష్పాద క్షేత్రం నందు నిర్వహించడం జరుగుతుందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుందని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నవంబర్ 4వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారి భజన బృందంతో గానామృత కార్యక్రమాలు అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం తో పాటు గోదారమ్మకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్తు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు