విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అవనిగడ్డలో డి ఎస్ సి, టెట్, కొచింగ్ లో అగ్రగామి గా ఉన్న ప్రతిభ అకాడమి బందర్ రోడ్, టైమ్ హాస్పిటల్ దగ్గర నూతనంగా ప్రతిభ సివిల్స్అకాడమి మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకళ్ళ నారాయణ, సంస్థ అధినేత జంపాన సుధాకర్ కు అభినందనలు తెలిపారు. ఇప్పటి ప్రభుత్వ ఉపాద్యాయులు అప్పటి ప్రతిభ కొచింగ్ సెంటర్ పూర్వ విద్యార్థులు తమ అనుభవాలు నూతన విద్యార్థులతో పంచుకొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ప్రారంభ అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళకుండా మన ప్రాంతంలోనే నాణ్యమైన సివిల్స్ కోచింగ్ ఇవ్వడానికి ఈ అకాడమీని ప్రారంభించడం చాలా గొప్ప విషయమని ఈ అకాడమి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రతిభ సంస్థను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు.
మాజీ యమ్.పి, ఎ.పి.యస్.ఆర్.టి.సి. చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ జంపాలసుధాకర్ నాకు చిన్నతనం నుండి తెలుసు, వారిలో కష్టపడేగుణం ఉంది. గత 20 సం॥లుగా ఎంతోమంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. ఆ అనుభవంతో ప్రతిభ సివిల్స్ అకాడమిని ప్రారంభించడం సంతోషకర విషయం. ఈ అకాడమి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
ప్రతిభ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ జంపాన సుధాకర్ మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ స్థాయిలోనే సివిల్స్ కోచింగ్ ఇవ్వడం వలన విద్యార్థులు సులువుగా సివిల్స్ సాధించడానికి సులభంగా ఉంటుంది అని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన అధ్యాపక బృందం, అలాగే విద్యార్థులకు రోజువారి, వారాల, నెలవారి పరీక్ష విధానంలో వారి మెదస్సుకు పదునుపెట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని అకాడమికి ప్రత్యేక హాస్టల్ సదుపాయం, విధ్యార్థులు శరీర ధృఢత్వం, మానసిక వికాసం పెంపొందించే ఉద్దేశ్యంతో మన ప్రతిభ సివిల్స్ అకాడమీలో ఆటలు, యోగ, మంచి పౌష్టిక ఆహారం అందించడం. మానసిక వికాసం కోసం ధ్యానం, మోటివేషన్ క్లాసెస్ చెప్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిభ సివిల్స్ అకాడమి మంచి సంకల్పంతో, సమయస్ఫూర్తితో, సృజనాత్మకతతో, నైతికతతో, సమన్వయంతో విధ్యార్థులు మరియు యాజమాన్యం ముందుకు వెళుతుందని అన్నారు.
ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు వెబ్సైట్ ఆవిష్కరణ చేసి, ప్రతిభ సివిల్స్ అకాడమి నాణ్యమైన కోచింగ్ అందిస్తుందని రిటైర్డ్ ఐఎఎస్ అశోక్, దేవానందరెడ్డి.(డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్) తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడేప్రసాద్, విధ్యార్థులు,తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంస్థ అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.