-16వ ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
16వ ఈశా ఫౌండేషన్ గ్రామోత్సవం వేడుకలకు సంబందించిన గోడ పత్రికను సచివాలయంలోని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి కార్యాలయం లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈశా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం అనే పత్ర్యేకమైన క్రీడ వేడుకను నిర్వహించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటలు ఆడడం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, వ్యసనాలు, అనారోగ్యకరమైన జీవనశైలి నుండి పజ్రలను బయటకు తీసుకురావడానికి సహాయపడుతుందని, కలిసి ఆటలు ఆడేప్పుడు అందరూ తమ గుర్తింపులను వదిలి ఆటలో లీనమవుతారని, సామాజిక అవధులను దాటి అందరినీ ఒక్కటి చేసి సమాజంలో సామరస్యాన్ని, ఆరోగ్యకరమైన పోటీస్ఫూర్తిని పెంపొందిస్తుందాని ఆటగాళ్ళలో ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసం కలిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామోత్సవం అంటే”గ్రామం యొక్క పండగ” అని అర్థమాని, మన దేశ జనాభాలో 75% గ్రామాలే! గ్రామీణ పజ్రల ఆరోగ్యం, సంక్షేమం మరియు సమృద్ధి లక్ష్యంగా ఈశా రూపొందించిన కార్యక్రమం ఇదని 2004లో తమిళనాడులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 30,000 గ్రామాలలో వాలీబాల్, త్రోబాల్ కబడ్డీ ఆటలలో 1,59,000 మందిపైగా ఆటగాళ్ళు, 13,350కిపైగా జట్లు, 28,350 మందికిపైగా గ్రామీణ మహిళలు ముఖ్యంగా గృహిణులు పాల్గొన్నారని. . ఇందులో రిజిస్ట్రేష్ట్రేన్ పూర్తిగా ఉచితం. పవ్రేశం కూడా ఉచితం. పోటీలను చూడడానికి వచ్చిన వారికి కూడా సరదా ఆటలు నిర్వహించబడతాయాని, ప్రతి ఒక్కరినీ ఏదోఒక రకమైన ఆటలో పాల్గొనమని ప్రోత్సహించడం ద్వా రా గ్రామీణ ఆటల వినోదాన్ని తిరిగి తీసుకురావడానికి అంతరించిపోతున్న సాంపద్రాయ కళలను పునరుద్ధరించడానికి, గ్రామం మొతాన్ని ఒకచోటికిచేర్చి వేడుకగా, ఉత్సా హాన్ని తీసుకువస్తుంది. రిజిస్టర్ చేసుకోడానికి: 8300030999 లేదా isha.co/gramotsavam సందర్శించగలరు కోరారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు ముఖ్యకార్యదర్శి వినయ్ చంద్, ఈశా ఫౌండేషన్ వాలంటీర్లు రాఘవ్ ముఖుంద్, రాధిక జీవి, భరత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.