విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో గురువారం ఉదయం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వాల్మీకి రామాయణంగా పేరు గాంచిన వాల్మీకి మహర్షిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం ఉందని, ఈ తరం విద్యార్థిని, విద్యార్థులకు మరియు ప్రతి ఒక్కరికి నాటి మహర్షి వాల్మీకి లాంటి గొప్ప వ్యక్తులను వారు చేసిన పనులను తెలియజేయడం అవసరమని తెలియజేశారు. ఈ వేడుకలలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ సురేష్ బాబు, ఎస్ ఈ (ప్రాజెక్ట్స్) సత్యకుమారి, అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …