-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుద్ధ్య నివారణలో ఎటువంటి లోపం ఉండకూడదని గురువారం ఉదయం పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అజిత్ సింగ్ నగర్, బుడమేరు వంతెన, ఇందిరా నాయక్ నగర్ పరిసర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుడమేరు కెనాల్ బండ్ పరిశుభ్రపరిచి, బుడమేరు కాలువలో ఉన్న గుర్రపు డెక్కలను తీసి ప్రజలకు ఎటువంటి వ్యాధులు బారిన పడకుండా ఉండేందుకు డ్రోన్ ద్వారా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సింగ్ నగర్ ఫ్లైఓవర్ లో ఉన్న మరమ్మతు పనులను త్వరతిగతిన పూర్తి చేసి, ఫ్లై ఓవర్ పైన ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి ఇందిరా నాయక్ నగర్ పరిసర ప్రాంతాలు పర్యటించి, పారిశుద్ధ్య నిర్వాహణ సరిగ్గా లేక గమనించి, అధికారులపై ఆగ్రహించారు. ఆ ప్రాంతంలో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండటం గమనించి, ఖాళీ స్థలాలలో వర్షపు నీరు నిలువ ఉన్నచో, ఆ నీటిని మిషన్లతో తీయించి, వ్యర్థాలను తొలగించి, వర్షపు నీరు నిలువ లేకుండా ఉండేటట్టు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా జరగాలంటే ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటరీ శాఖల సిబ్బంది సమన్వయంతో పని పనిచేయాలని అలా ప్రతి డివిజన్లో సమన్వయంతో పని చేస్తే నగర పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచవచ్చని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, యస్ ఈ (వర్క్స్) పి సుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.