గుడ్లవల్లేరు(కౌతవరం), నేటి పత్రిక ప్రజావార్త :
యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు సాధించి, పరిశ్రమలు ఏర్పాటు చేసి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ లతో కలసి రెవెన్యూ మంత్రి గురువారం కౌతవరంలో 23 లక్షల అంచనా వ్యయంతో ఆధునీకరించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనం ప్రారంభించారు.
అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, జేసీలతో కలిసి కౌతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ పి పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పెట్రోల్ బంకు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ వంద ఏళ్లకు పైగా చరిత్ర గల సబ్ రిజిస్ట్రార్ భవనం ఆధునికరించి ఈరోజు ప్రారంభించుకున్నామని, అదేవిధంగా పిఎసిఎస్ ఆధ్వర్యంలో హెచ్పీసీఎల్ బంక్ ప్రారంభించుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గుడివాడ అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఆర్థిక స్థిరత్వం లేని పరిపాలనతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి మొదటిగా 5 ఫైళ్లపై సంతకాలు చేశారన్నారు. పింఛన్ల 4 వేలకు పెంపు చేయడంతో పాటు, వచ్చే దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి
ప్రతి పంచాయతీలో గ్రామసభలు పెట్టి 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీలకు అందించి, సర్పంచుల ఆత్మగౌరవం నిలబెట్టారని అన్నారు.
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులు చేపట్టిన విషయం మంత్రి గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాలపై గ్రామాల్లో అధ్యయనం చేస్తున్నమని, భూముల సమస్యలు త్వరలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.
నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ కావాలని ఎమ్మెల్యే అడిగారని, గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి హామీ ఇచ్చారు.
గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే రాము సేవలు అభినందనీయం అన్నారు. సూపర్ సిక్స్ కార్యక్రమాలు అమలులో భాగంగా జులై 1 న పింఛన్ల పెంపు అమలు చేసినట్లు, రెండోది దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో దోచుకున్న భూములపై విచారణ జరిపి, వాటికి విముక్తి కలిగించనున్నట్లు తెలిపారు. జిల్లాలో శాసనసభ్యులందరి సహకారంతో బందరు పోర్టు పనులు పూర్తి చేస్తామని, గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము మాట్లాడుతూ కౌతవరంలో ఎన్నడూ లేని గొప్ప మెజారిటీతో గెలిపించిన గ్రామస్తులకు ధన్యవాదాలు, అందరూ కలిసికట్టుగా అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు.
నియోజకవర్గ కూటమి నాయకులు సురేంద్రబాబు, బూరగడ్డ శ్రీకాంత్, పిన్నమనేని బాబ్జి, వల్లభనేని బాబురావు, మల్లిపెద్ది సుబ్బారావు తదితరులు సభలో మాట్లాడారు.
రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిఐజి రవీంద్రనాథ్, జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్ గోపాలకృష్ణమూర్తి, సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రావులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనగా, జిల్లా సహకార శాఖ అధికారి కె చంద్రశేఖర రావు, డివిజనల్ సాకార అధికారి వివి ఫణి కుమార్, హెచ్ పి సీ ఎల్ అధికారులు పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో పాల్గొనగా, ఈ కార్యక్రమాలలో గుడివాడ ఆర్టీవో బాలసుబ్రమణ్యం, తాసిల్దార్ బి లోకరాజు, ఎంపీడీవో ఇన్చార్జి సారథి, తదితరులు పాల్గొన్నారు.