తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ (ఈసిఎల్) కంపెనీ కి సంబంధించిన పలు అంశాలపై తగు చర్యలు నిబంధనల మేరకు చేపట్టాలని సంబంధింత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు శ్రీకాళహస్తి ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ వారికి సంబంధించిన పలు అంశాలపై కంపెనీ ప్రతినిధులు సురేష్ ఖండేల్వాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జెసి శుభం బన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపు రెడ్డి మౌర్య, ఎస్ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ మదన గోపాల్, తదితర సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసిఎల్ ప్లాంట్ తూర్పు గేట్ రహదారి వెడల్పుకు సంబంధించి పరిశీలించాలని, అలాగే 5 కి.మీ పొడవు వెంకటగిరి హైవే కు కనెక్ట్ చేసే రోడ్ నిర్మాణం ఎస్టిమేట్ తయారీ అంశాలు పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు చేపట్టాలని, తెలుగు గంగ నుండి ఇండస్ట్రియల్ వాటర్ ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్లాంట్ నకు కేటాయింపు అంశంపై విసి అండ్ ఎండి ఏపీఐఐసి కి పంపడం జరుగుతుందని, అలాగే తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నుండి ట్రీట్మెంట్ నీటి సరఫరా ధర అంశంపై కమిషనర్ నిబంధనల మేరకు పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ తెలుగు గంగ వెంకటగిరి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.