శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
గతంలో వర్షాలకు ముందు తక్కువ నీరు నిల్వ ఉన్న తొండమనాడు చెరువు నేడు పూర్తి స్థాయిలో 229.48 ఎంసిఎఫ్టి నిండి కలుజు పారుతున్న నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఇరిగేషన్ శాఖ ఎస్ఈ మదన గోపాల్, ఈఈ రాధాకృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితర సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సదరు చెరువు పూర్తి స్థాయిలో నిండడం ద్వారా 4386 ఎకరాల ఆయకట్టుకు ఎంతగానో ఉపయోగం కానున్నదని కలెక్టర్ కు అధికారులు వివరించారు. డీసిల్టేషన్ చేపడితే రైతుల పొలాలకు సాఫీ గా నీరు అందుతుందని అధికారులు తెలపగా నిధులు సమకురుస్తామని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు నాలుగు రోజులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీకాళహస్తి, ఏర్పేడు లో 8 నుండి 9 సెం.మీ ల వర్షం కురిసిందని అన్నారు. దీని ద్వారా పలు చెరువులలో నీరు చేరిందని, వర్షాలకు తొండమనాడు చెరువు నందు సదరు వర్షాలకు ముందు 0.1టి.ఎం.సి నీరు నిల్వ ఉండేదని ఇప్పుడు 0.5 టిఎంసి ల నీరు నిల్వ ఉంటూ కలుజు పారుతోందని, దీని ద్వారా 14 గ్రామాల పంటలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో 350 పై చిలుకు ఇళ్లలో నీరు చేరిన నేపథ్యంలో వారిని పునరావాస కేంద్రాలలో ఉంచి వారికి భోజనం, త్రాగు నీరు, మందులను అందించడం జరిగిందనీ తెలిపారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.
డ్రైన్ వాటర్ ను వినియోగించుకుంటే చాలా మంచిదని గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు చెబుతుంటారు అని అన్నారు.
వీరి వెంట శ్రీకాళహస్తి తాసిల్దార్ లక్ష్మీ నారాయణ, ఎంపిడిఓ రఫీ తదితరులు పాల్గొన్నారు.