Breaking News

బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏర్పేడు మండలం చిన్నప్పగుంట ఎస్టీ కాలనీ కందాడు గ్రామ పంచాయితీ నందు కూలిపోయిన మట్టి మిద్దెలు, పూరి గుడిసెలను పరిశీలించి బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

జి. గంగమ్మ w/o నడిపయ్య, చంద్రమ్మ w/o జి. వెంకటాద్రి, ఎం.చెంచమ్మ w/o ఎం. నరసింహులు మట్టి మిద్దెలు, పూరి గుడిసెలు కూలిపోయిన వర్ష బాధితులను పరామర్శించి కలెక్టర్ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పరిహారం అందిస్తామని, పట్టా ఇచ్చి ఇల్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్ని రోజులు ఇలా పూరి గుడిసెలు మట్టి మిద్దెలలో ఉంటారు అని, ప్రభుత్వం ఎంతో మంచిగా ఇల్లు లేని పేదలకు వరంగా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇల్లు నిర్మాణానికి ఎంతో సహకారం అందిస్తోందని గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం ప్రారంభించాలని కోరారు. గ్రామ ప్రజలు నీటి ట్యాంకు గురించి అడుగగా జేజేఎం కింద ఆర్ డబ్ల్యుఎస్ వారు చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రానికి రన్నింగ్ నీటి కొరకు కోరగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదరు కాలనీకి మంజూరు చేయబడిన ఇళ్లను దీపావళి నాటికి ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంకా అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలోని పిల్లలను అందరినీ పాఠశాలలకు పంపాలని, అమ్మాయిలను కూడా సమానంగా చూడాలని చదివించాలని అన్నారు.

ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇంటి మంజూరుకు హౌసింగ్ అధికారులు పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏర్పేడు తాసిల్దారు భార్గవి, ఎంపిడిఓ సౌభాగ్యం, హౌసింగ్ ఏఈ తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *